కోనసీమ గ్యాస్ లీకేజీపై అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు, ప్రజల భద్రతకు ఆదేశం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక వద్ద ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజీ
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా వెలువడిన గ్యాస్
భారీ ఎత్తున పైకి ఎగసిపడుతున్న గ్యాస్.
గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి...గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ఓఎన్జీసీ ప్రత్యేక సాంకేతిక బృందాలతో తక్షణ చర్యలు చేపట్టాలి.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులను తక్షణం సంప్రదించాలని అధికారులకు సీఎం సూచన.
ఓఎన్జీసీ ఛైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి భద్రతా చర్యలపై సమీక్షించాలని ఆదేశం.
గ్యాస్ బావి చుట్టూ కిలోమీటరు పరిధిలోని నివాస ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించిన అధికారులు.
ఇప్పటివరకు ఎలాంటి మంటలు చెలరేగలేదు.. గ్యాస్ బావి ముఖద్వారం పటిష్టంగా ఉందన్న ఓఎన్జీసీ అధికారులు
భూమికి సమీపంలో గ్యాస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్న ఓఎన్జీసీ సిబ్బంది.
ప్రమాద నివారణలో భాగంగా డీజిల్ జనరేటర్లు, ఇతర పరికరాలను నిలిపివేసి సమీప ప్రాంతాల నుంచి తరలింపు.
గ్యాస్ బావి లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు ఘటనా స్థలానికి చేరుకుంటున్న సిమెంటింగ్ బృందం.
మరో 4–5 గంటల్లో గ్యాస్ లీకేజీ ఘటనను పూర్తిగా నియంత్రించగలమని వెల్లడించిన ఓఎన్జీసీ అధికారులు.





