టోల్‌ప్లాజాలోకి వచ్చిన పాము... భయంతో పరుగులు పెట్టిన సిబ్బంది... ఆ తరువాత ఏం జరిగిందంటే.

ప్రకాశంజిల్లా త్రిపురాంతకం మండలం మేడపి దగ్గర జాతీయ రహదారి పై ఉన్న టోల్ గేట్ దగ్గర అందరూ బిజీగా ఉన్నారు... అటూ, ఇటూ వాహనాలు టోల్ ట్యాక్స్‌లు చెల్లిస్తూ నిదానంగా కదులుతున్నాయి... ఇంతలో ఏదో అలికిడి, బుస్సు, బుస్సు మని శబ్దాలు రావడంతో అంత రద్దీలోనూ టోల్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు... అక్కడ గోడవారగా పాక్కుంటూ వెళుతున్న అరుదైన లేత గోధుమ, ఎరుపు రంగు చారలతో ఉన్న ఐదడుగుల పాము కనిపించింది... టోల్‌ట్యాక్స్ మాట దేవుడెరుగు పామును చూసి టోల్ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు... వెంటనే సమీపంలోని స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు... టోల్‌ప్లాజా దగ్గరకు చేరుకున్న స్నేక్ క్యాచర్ పాముని పట్టుకుని మైదాన ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు... తీరా ఆరా తీస్తే అది చూసేందుకు భయంకరంగా కనిపిస్తున్నా, విషరహిత బ్యాండెడ్ రేసర్ పాముగా గుర్తించారు...





