తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

రొయ్య రైతుల పేరుతో జగన్‌ది కపట ప్రేమ.. సాక్షిది విషప్రచారం!

ప్రత్యేక కథనంజాతీయం
రొయ్య రైతుల పేరుతో జగన్‌ది కపట ప్రేమ.. సాక్షిది విషప్రచారం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జగన్, సాక్షి కలిసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం సిగ్గుచేటు

రైతుల కష్టాలను రాజకీయాలకు వాడుకోవడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

తుఫాను బాధిత ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం.. రూ.3.96 కోట్ల నష్టం అంచనా

సెప్టెంబర్‌లో రొయ్యల ధర కిలో రూ.280కి చేరిన విషయం సాక్షికి కనిపించలేదా?

75 వేల ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రూ.1,300 కోట్ల రాయితీ.. ఇవి జగన్‌కు కనిపించవా?

ప్రపంచ మార్కెట్‌లో ధరలు తగ్గితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం రాజకీయ దివాలాకోరుతనం

రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు

అమరావతి, నవంబర్ 16:* రొయ్య రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్, సాక్షి పత్రిక కలిసి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి తెరలేపారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను దాచిపెట్టి తప్పుడు కథనాలు ప్రచురించడం సిగ్గుచేటన్నారు. ఆర్నాబ్, మురసు తుఫానులతో 1,071 మంది ఆక్వా రైతులకు చెందిన 1,720.90 హెక్టార్లలో నష్టాన్ని గుర్తించి, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.3.96 కోట్ల నష్టం అంచనా వేసి కేంద్రానికి పరిహార ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తుఫానులకు ముందే రైతులను అప్రమత్తం చేసి నష్టనివారణ చర్యలు చేపట్టామని, ఇన్ని చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సాక్షి ఎలా రాస్తుందని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో 100 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.200 నుంచి రూ.210 పరిధిలో ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.280కి చేరిన విషయం జగన్‌కు, సాక్షికి కనిపించలేదా అని మంత్రి నిలదీశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, సరఫరా, ఎగుమతుల పరిస్థితులతో ధరల్లో హెచ్చుతగ్గులు వస్తాయని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. రైతులకు మెరుగైన ధరలు అందించేందుకు ఫార్మ్‌గేట్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నామని, మేత ధరలపై ప్రతి 45 రోజులకు రైతు సంఘాలు, కంపెనీలతో సమీక్షిస్తున్నామని తెలిపారు. రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, వాస్తవాలను వక్రీకరించి భయాందోళనలు సృష్టించడం జగన్, సాక్షికే చెల్లిందని విమర్శించారు.

సంబంధిత వార్తలు