బాబుకు సిరప్ ఇచ్చే విషయంలో అత్తతో గొడవ.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం శ్రీరామ్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
రెండున్నరేళ్ల కుమారుడికి సిరప్ ఇచ్చే విషయంలో అత్తతో జరిగిన వివాదం అనంతరం సత్య శ్యామలాంబిక అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
అత్త మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
నాలుగేళ్ల క్రితం వివాహమైన శ్యామలాంబికకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త వీరపణి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.





