మధ్యప్రదేశ్‌లో ఇండిగో ఉద్యోగిని వర్ష దారుణ హత్య, స్నేహితుడు నితేశ్ అదుపులో

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
35 ఏళ్ల ఇండిగో ఉద్యోగిని దారుణ హత్య.. స్నేహితుడితో వెళ్లి విగతజీవిగా.. అతడిపైనే పోలీసుల అనుమానం!
పుణె విమానాశ్రయంలో ఇండిగో టికెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న వర్ష తుర్కర్ (35) హత్యకు గురయ్యారు.
దీపావళికి మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పుట్టింటికి వెళ్లిన వర్ష, నవంబర్ 14న స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి వైన్‌గంగా నది వద్దకు వెళ్లారు.
ముగ్గురు ముసుగు దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని నితేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో కనిపించిన వర్షను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నితేశ్‌కు ఎలాంటి గాయాలు లేకపోవడం, విచారణలో పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పదునైన ఆయుధంతో వర్షపై దాడి జరిగినట్లు గుర్తించారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.





