32 ఏళ్ల యువకుడి చేతిలో దిగిన హాస్టల్ గేటు ఇనుప రాడ్డు.. గంటపాటు విలవిల!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఉన్న మణికంఠ (32) తాను ఉంటున్న హాస్టల్ గేటు దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టు తప్పడంతో గేటుపై ఉన్న ఇనుప రాడ్డు అతడి చేతిలోకి దిగింది.
దాదాపు గంటపాటు గేటుకే చిక్కుకుని తీవ్ర నొప్పితో విలవిలలాడాడు.
స్థానికుల సమాచారంతో వెల్డింగ్ కట్టర్ సాయంతో గేటును కత్తిరించి, చేతిలో ఇరుక్కున్న ఇనుప భాగంతో సహా మణికంఠను ఆస్పత్రికి తరలించారు.





