వణికిస్తున్న క్షుద్రపూజలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆది, గురు వారాలు వస్తేనే హడల్...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజల ఆనవాళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం, గురువారం, అమావాస్య రోజులు వచ్చాయంటే చాలు పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రహదారులు, కూడళ్లు, పొలాల గట్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లు, ఎండుమిర్చి వంటి వస్తువులను ఉంచి పూజలు చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తుండటంతో స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
మూఢనమ్మకాల పేరుతో ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.





