పైలట్ లేకుండానే ప్రయాణం.. చైనా నుంచి 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చైనా ‘CE-25A’ పేరుతో 10 టన్నుల బరువైన ఎలక్ట్రిక్ విమానాన్ని అభివృద్ధి చేసినట్లు సమాచారం.
ఈ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకు 300 కి.మీ. వేగంతో 400 కి.మీ. ప్రయాణించగలదని చెబుతున్నారు.
19 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో, 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించేలా రూపొందించినట్లు సమాచారం. పైలట్ లేకుండా నడిచే ఆటోనమస్ టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సాంకేతిక వివరాలు, పైలట్ రహిత ప్రయాణ సామర్థ్యంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.





