తెలంగాణలో కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు.. నవంబర్ 19న బ్యాంకు ఖాతాల్లో నగదు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేసేందుకు సెర్ప్ (SERP) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
లబ్ధిదారుల వివరాలు:
వితంతువులు – 2,77,894 మంది
దివ్యాంగులు – 1,00,224 మంది
ఒంటరి మహిళలు – 53,844 మంది
గీత కార్మికులు – 27,444 మంది
చేనేత కార్మికులు – 4,451 మంది
పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతుండగా, అవసరమైన అదనపు నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం.





