మసీదుకు నిధులిచ్చిన జీహెచ్‌ఎంసీ.. పక్కనే ఉన్న ఆలయానికి ఎందుకు ఇవ్వదు?: పల్లపు గోవర్ధన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫిలింనగర్‌లో మసీదు అభివృద్ధి, ప్రహరీ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నిధులు కేటాయించినప్పుడు పక్కనే ఉన్న పర్వతాంజనేయ స్వామి ఆలయానికి ఎందుకు కేటాయించడం లేదని భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ ప్రశ్నించారు.
ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయంలో రోడ్డు, తాగునీరు, స్నానపు గదులు, గోవులకు షెడ్డు వంటి కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆలయంలో అయ్యప్ప భక్తుల కోసం 50 రోజుల భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన గోవర్ధన్, పూర్తి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు.
ఆలయ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.





