వేరే కులం యువకుడిని ప్రేమించిందని.. దీపావళి రోజే కూతురిని హత్య చేసిన తండ్రి!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా మెట్‌పూర్‌లో పరువు హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందన్న కారణంతో కుమార్తె సాన్యా పటేల్ (21)ను తండ్రి కౌశల్ కుమార్ పటేల్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వడోదరలో బీకామ్ పూర్తి చేసిన సాన్యా ఏడాది కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ సంబంధాన్ని వ్యతిరేకించిన తండ్రి పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం.
దీపావళి రోజున ప్రేమ వ్యవహారంపై మరోసారి వాగ్వాదం జరగడంతో, కుమార్తె గొంతును చున్నీతో నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.





