ఏనుగు తొక్కినా ప్రాణాలతో బయటపడ్డాడు..🐘
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలో ఓ బైకర్ ఏనుగు దాడి నుంచి తప్పించుకొని అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఓ ఏనుగు, బైకర్పై దాడి చేసి కిందపడేసింది. ఆపై అతనిపై కాలు వేసి తొక్కేందుకు ప్రయత్నించడంతో స్థానికులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులకు ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో ఆ యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.





