మానవ హక్కుల సంఘం పేరుతో హోటళ్లలో వసూళ్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మానవ హక్కుల సంఘం పేరుతో కొందరు హోటళ్లలో వసూళ్లకు పాల్పడుతున్నారు. లైసెన్సులు లేవంటూ తనిఖీలు చేసి డబ్బులు గుంజుతున్నారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో ఈ తరహా ఘటనలు కలకలం రేపాయి. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.





