రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాగార్జున ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో వార్తల్లో నిలిచిన తమ్మిడికుంట చెరువు.. రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. 2024 ఆగస్టులో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేయడంతో ఈ చెరువు వార్తల్లో నిలిచింది. పునరుద్ధరించిన చెరువును నవంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం.
హైడ్రా వెల్లడించిన వివరాల ప్రకారం చెరువు విస్తీర్ణం 12 ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు పెరిగింది. సుమారు 35 వేల ట్రక్కుల వ్యర్థాలను తొలగించగా, నీటి నిల్వ సామర్థ్యం 4.6 కోట్ల లీటర్ల నుంచి 37.5 కోట్ల లీటర్లకు పెరిగింది.





