భార్య అదృశ్యం, భర్త పిర్యాదు..

ఉప్పల్, సాయిరాం కాలనీ, హనుమాన్ నగర్ కు చెందిన జిల్లెల్ల గోవర్ధన్ రెడ్డి (33) రాపిడో డ్రైవర్..
తన భార్య జిల్లెల్ల ప్రతిమ (29) హౌస్ కీపింగ్
గత కొంత కాలంగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు
ఈ క్రమంలో 05.10.2026 తేదీన ఉదయం సుమారు 06:00 గంటలకు వ్యక్తిగత పని నిమిత్తం తన స్వగ్రామమైన సింగాయిపల్లి, రాజంపేట మండలం, కామారెడ్డి జిల్లాకు వెళ్లి, తన భార్యను ఇంటి వద్దనే ఉంచి వెళ్లినట్లు తెలిపాడు.
తిరిగి 06.10.2026 తేదీన రాత్రి సుమారు 07:00 గంటలకు ఇంటికి వచ్చి చూడగా, తన భార్య కనిపించలేదని తెలిపాడు. ఆమెకు ఫోన్ చేయగా, తాను మానసికంగా ఇబ్బందిగా ఉన్నానని, ఒక నెల తర్వాత ఇంటికి తిరిగి వస్తానని చెప్పిందని తెలిపాడు.
ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాటు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు తెలిపాడు. 09.11.2026 తేదీన రాత్రి సుమారు 07:30 గంటలకు ఆమె ఫోన్ ఒక్కసారి రింగ్ అయి తిరిగి స్విచ్ ఆఫ్ అయిందని తెలిపాడు.
ఫిర్యాదుదారుడు, అతని బంధువులు వివిధ ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదని తెలిపాడు.
కావున, తన భార్య ఆచూకీ కనుగొని, ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ ఫిర్యాదు చేసినాడు.





