ఆడ - మగా సామూహికంగా బతుకమ్మ సంబరాలు..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆ ఒక్క గ్రామంలో మాత్రమే వింత ఆచారం..
దీపావళి సందర్భంగా బతుకమ్మ వేడుకలు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే వేడుక బతుకమ్మ ఉత్సవాలు... కేవలం ఆడవాళ్లు మాత్రమే ఆడుకునే సాంప్రదాయ వేడుక...ఆ ఒక్క గ్రామంలో మాత్రమే దీపావళి సందర్భంగా బతుకమ్మ సంబరాలు విర్వహించడం ఆనవాయితీ... ఆడ - మగా కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించడం విశేషం... దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే ఆ ఊరి బతుకమ్మ ప్రత్యేకత ఏంటి..!
రాష్ట్రవ్యాప్తంగా ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహించడం ఆనవాయితీ.. అమావాస్య నుండి మొదలుకొని తొమ్మిది రోజులపాటు రోజుకో రీతిన బతుకమ్మ సంబరాలు జరుగుతాయి.. కానీ హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో మాత్రం బతుకమ్మ పండుగ వేల మహిళలు ఉత్సవాలకు దూరంగా ఉంటారు.. దీపావళి సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఈ గ్రామంలో ఓ వింత ఆచారం..





