తాత ఆస్తిలో మనవడికి జన్మహక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తాత ఆస్తి వారసత్వంగా తండ్రికి సంక్రమిస్తే, ఆ ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే వాటా దక్కదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం తండ్రికి సంక్రమించి, ఆస్తి పంపకాల్లో ఆయన వాటాగా వచ్చిన ఆస్తి వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందని పేర్కొంది. తండ్రి జీవించి ఉండగానే ఆ ఆస్తిలో సగం వాటా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీతా అగర్వాల్ ధర్మాసనం కొట్టివేసింది. అయితే ఈ తీర్పు అన్ని రకాల ఉమ్మడి కుటుంబ ఆస్తులకు వర్తించదని, ఆస్తి సంక్రమించిన విధానం కీలకమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.





