వివాహేతర సంబంధం బయటపడటంతో ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు భారీ షాక్ అంటూ ప్రచారం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చైనాకు చెందిన స్పై అలయన్స్ వ్యవస్థాపకురాలు హు వాంగ్‌తో ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్విడియా షేర్లు పడిపోయాయని, ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలు, వాటికి షేర్ల పతనంతో ఉన్న సంబంధం అధికారికంగా నిర్ధారణ కాలేదు.
చైనా నిఘా సంస్థతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మహిళతో హువాంగ్ సన్నిహిత సంబంధంపై ఎన్విడియా బోర్డు విచారణ ప్రారంభించింది. నవంబర్ 9న కంపెనీ షేర్లు 4.27% పడిపోయాయి. అయితే గూఢచర్య ఆరోపణలను చైనా ఖండించింది.





