లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
లోన్ యాప్ వేధింపులు ఓ కానిస్టేబుల్ ప్రాణాలు తీశాయి. HYD కొండాపూర్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న శ్రీను(31) నాలుగు నెలల క్రితం యాప్లో రూ.40 వేల లోన్ తీసుకున్నాడు. రీపేమెంట్స్ టైమ్కు చేయకపోవడంతో నిర్వాహకుల నుంచి వేధింపులు, అసభ్యకర బెదిరింపులు ఎదుర్కొన్నాడు. కుటుంబీకులకు నగ్న చిత్రాలు పంపుతామంటూ వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు





