జపాన్‌లో దేవరకొండ ఫ్యామిలీ దీపావళి.. రష్మికతో కలిసి హోమంలో విజయ్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈసారి దీపావళిని జపాన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న.
విజయ్ తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పండుగ జరుపుకున్న వీరు.. అక్కడ ప్రత్యేకంగా GOMA (హోమం) అగ్ని పూజలో పాల్గొన్నారు.
“జపాన్‌లోనూ హోమం చేసే మార్గం దొరికింది.. దేవరకొండ ఫ్యామిలీ నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు” అంటూ విజయ్ పండుగ ఫొటోలను పంచుకున్నారు.
విజయ్–రష్మిక జపాన్ దీపావళి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





