లక్డీకాపూల్‌లో వన్‌వే విధానం.. నవంబర్ 22న ట్రయల్ రన్..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు లక్డీకాపూల్‌లో నూతన ట్రాఫిక్ విధానం.
రవీంద్రభారతి – లక్డీకాపూల్ – ఇక్బాల్ మినార్ జంక్షన్ల మధ్య వన్‌వే ప్రతిపాదన.
నవంబర్ 22న ఒక్కరోజు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహణ.
స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ మార్గాలను పరిశీలించిన సీపీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్.
లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూం తదితర జంక్షన్ల పరిశీలన.
వన్‌వే విధానానికి అనుగుణంగా జంక్షన్ల రీడిజైనింగ్, భారీ రోడ్డు ఇంజినీరింగ్ మార్పులు.
ఓల్డ్ కంట్రోల్ రూం నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్ మినార్‌కు నేరుగా వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరణ.
హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ మీదుగా వాహనాల మళ్లింపు.
నిరంకారి జంక్షన్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, రవీంద్రభారతి మీదుగా వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం.
పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి రైట్ టర్న్ తీసుకొని ఓల్డ్ కంట్రోల్ రూం వైపు వెళ్లేలా మార్గం.
ట్రయల్ రన్‌కు ముందే స్థానిక వ్యాపారులు, నివాసితులు, నిత్య ప్రయాణికులతో ప్రత్యేక సమావేశం.
ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు.
ట్రయల్ రన్‌లో వాహనాల రద్దీ, ప్రయాణ సమయం, ట్రాఫిక్ వేగంపై సమగ్ర డేటా సేకరణ.
వాహనదారులకు ఇబ్బందులు తగ్గించి, ప్రయాణ సమయం, ఇంధనం ఆదా చేయడమే లక్ష్యం.
ప్రజల ఫీడ్‌బ్యాక్, సాంకేతిక డేటా ఆధారంగానే వన్‌వే విధానం కొనసాగింపుపై తుది నిర్ణయం.
వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి ట్రయల్ రన్‌కు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి.





