📅🙏 శ్రీవారి 2027 క్యాలెండర్లు, డైరీలు ఇక ఆన్‌లైన్‌లో.. ఇంటికే తెప్పించుకోవచ్చు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టీటీడీ విడుదల చేసిన 2027 శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక టీటీడీ పోర్టల్‌లో Publications విభాగం ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
టీటీడీ ఇప్పటికే 10 లక్షల డైరీలు, 13.50 లక్షల 12-పేజీల క్యాలెండర్లు, 75 వేల 6-పేజీల క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం తెలిపింది.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వారికి పోస్టల్ డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.





