💔🚗 దీపావళికి ఇంటికి బయల్దేరిన కుటుంబం.. నదిలో పడిన కారు, నలుగురు మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఛత్తీస్‌గఢ్‌లో రాజిమ్ సమీపంలోని టిలా అనికట్ వద్ద కారు నదిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
మృతులను శీతల్ ప్రసాద్ సాహు, భార్య భారతి, కుమార్తె పూర్వ, కుమారుడు వికాస్గా గుర్తించారు. దీపావళి కోసం రాయ్‌పూర్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కారును నది నుంచి వెలికితీసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





