ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

దీపావళి టపాకాయల పొగతో గ్యాస్ ఛాంబర్ లా మారిన ఢిల్లీ
500మీటర్లకు పడిపోయిన విజబులిటీ
రాత్రి 10గంటల తరువాత కూడా బాణాసంచా కాల్చిన ఢిల్లీ ప్రజలు
సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోని ఢిల్లీ వాసులు
నవంబర్ 7,8 తేదీల్లో ఉదయం 6-7,రాత్రి 8-10వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి జరుపుకోవాలన్న సుప్రీంకోర్టు
ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయుకాలుష్యం
గాలిలో పెరిగిన దుమ్ము ,ధూళి,కాలుష్య కారకాలు..రోడ్లపై తగ్గిన విజబులిటి
ఢిల్లీలో సగటున 366 పాయింట్లుగా AQI పై వాయు నాణ్యత
ఢిల్లీలోని 59కాలుష్య నమోదు కేంద్రాల్లో 16 కేంద్రాల్లో AQI పై 400పాయింట్లకు పైగా సివియర్ కేటగిరిలో ఉన్న వాయు నాణ్యత
37 కాలుష్య నమోదు కేంద్రాల్లో AQI పై 300 పాయింట్లకు పైగా వెరీ పూర్ కేటగిరీలో వాయు నాణ్యత నమోదు
సోనియా విహార్ అత్యధికంగా 457 పాయింట్లుగా AQI వాయు నాణ్యత నమోదు
వివేక్ విహార్ 445, జహంగీర్ పురి 442, పుసా 405,ఆర్కె పురం 370, నరేలా 386, ముండ్కా 408, డియు నార్త్ క్యాంపస్ 437,అలీ పూర్ 395, భవనా 427పాయింట్లుగా వాయు నాణ్యత
కాలుష్యం పెరగడంతో కళ్ళ మంటలు,గొంతు నొప్పి,దగ్గు,శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
గాలి వేగం తగ్గడం, చలి పెరుగుతుండటం ,పంట వ్యర్థాల దహనం వల్ల వచ్చే పొగ,వాహన కాలుష్యంతో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
కాలుష్యం పెరగడంతో ఢిల్లీ ఎన్సీఆర్ లో అమలవుతున్న గ్రాప్ 1, 2,3 చర్యలు





