AI మార్ఫింగ్ ఫోటో వివాదం.. విద్యార్థి మృతి కేసులో ప్రిన్సిపాల్, లెక్చరర్ అరెస్ట్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో 20 ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి భాను ప్రసాద్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
లెక్చరర్‌కు సంబంధించిన ఫోటోను AIతో మార్ఫింగ్ చేశాడన్న ఆరోపణతో విద్యార్థి ఫోన్‌ను కాలేజీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. క్షమాపణ చెప్పినా వారం రోజులుగా ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబం ఆరోపించింది.
ఫిర్యాదు ఆధారంగా ప్రిన్సిపాల్, లెక్చరర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగంతో కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.





