భార్యను హత్య చేసి.. తెగిన తలతో ఆలయంలో కూర్చున్న భర్త! బెంగాల్‌లో దారుణం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రింటు ఘోష్ అనే వ్యక్తి తన భార్య సీమా సర్కార్‌ను ఇంట్లో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం భార్య తెగిన తలను తీసుకుని సమీపంలోని కాళీమాత ఆలయంలో కూర్చున్న అతడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన సమయంలో దంపతుల ఇద్దరు చిన్నారులు కూడా ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
దంపతుల మధ్య వివాదం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, అసలు కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





