రక్షించాల్సిన పోలీసులపైనే ‘దారిదోపిడీ’ కేసు.. షేక్‌పేట్‌లో ₹50 వేలు లాక్కున్నారంటూ ఫిర్యాదు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్, హోంగార్డుపై రాబరీ కేసు నమోదవడం కలకలం రేపింది.
నవంబర్ 4న షేక్‌పేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి బ్యాగులో నగదు చూసిన కానిస్టేబుల్, హోంగార్డు ₹70 వేలు ఇవ్వాలంటూ బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు.
తన అవసరాల కోసం ఆ డబ్బు ఉందని చెప్పినా వినకుండా ₹50 వేలు తీసుకెళ్లినట్లు బాధితుడు రెండు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ మల్సూర్‌తో పాటు హోంగార్డుపై కేసు నమోదు చేసిన పోలీసులు, హోంగార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత కానిస్టేబుల్ పరారైనట్లు సమాచారం.





