తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!ఈనెల 12,13,14 న హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీచీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!ఈనెల 12,13,14 న హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపటి నుంచి మూడు రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన

ప్రత్యేక కథనంజాతీయం
రేపటి నుంచి మూడు రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభించనున్న సీఎం

రూ.9,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం

రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

రేపు ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్న సీఎం.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించనున్న సీఎం.

మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం.

మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేటఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి.

అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి చేరుకోనున్న సీఎం.

రేపు రాత్రి కొడంగల్‌లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఎల్లుండి (నవంబర్ 8 న ) ఉదయం 9.30 గంటల నుంచి 10.20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.

ఉదయం 10.20 గంటలకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్న సీఎం.

ఉదయం 10.30 కు ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్న సీఎం .

ఉదయం 10.45 కు హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభించనున్న సీఎం.

ఉదయం 11 గంటలకు రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం .

ఉదయం 11.30 గంటలకు బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం

ఉదయం 11.45 గంటలకు రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

మధ్యాహ్నం 12.15 గంటలకు కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం.

మధ్యాహ్నం 12.45 గంటలకు దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, 1.15 గంటలకు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి .

మధ్యాహ్నం 1.40 గంటలకు కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన.

మధ్యాహ్నం 2 గంటలకు కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించనున్న సీఎం.

మధ్యాహ్నం 2.45 గంటలకు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి .

మధ్యాహ్నం 3.30 గంటలకు దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు