🥤PVRలో వాడేసిన కప్పులే మళ్లీ వాడుతున్నారా?.. వైరల్ వీడియోతో హైజీన్‌పై ప్రశ్నలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెంగళూరులోని Forum South Mall PVR Cinemasలో ఉపయోగించిన డిస్పోజబుల్ డ్రింక్ కప్పులను తిరిగి వాడుతున్నారంటూ ఓ కస్టమర్ చేసిన ఆరోపణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో కొన్ని కప్పుల్లో ఇప్పటికే డ్రింక్ ఆనవాళ్లు ఉన్నాయని కస్టమర్ ప్రశ్నించగా, సిబ్బంది వాటిని మార్చి కొత్త డ్రింక్ ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ కప్పులు నిజంగా మళ్లీ వినియోగించారా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
వివాదంపై Forum South Mall కస్టమర్‌కు క్షమాపణ చెబుతూ, PVR టీమ్ విచారణ జరుపుతోందని తెలిపింది. ప్రీమియం ధరలు చెల్లిస్తున్నప్పుడు కనీసం పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.





