⚠️ సున్నితమైన దృశ్యాలు

20,21 ఏళ్ల విద్యార్థులు మృతి
Engeneering కాలేజీలో రెండు రోజుల ఫెస్ట్ ఉండంటంతో ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయిన ఇద్దరు విద్యార్థులు
రాత్రి ఫెస్ట్ పనులు పూర్తైన తరువాత మద్యం సేవించడానికి సమీపంలోని పొలం దగ్గరికి వెళ్ళిన విద్యార్థులు
మద్యం సేవిస్తున్న సమయంలో పొలం దగ్గరికి వచ్చిన పెట్రోలింగ్ టీమ్
పెట్రోలింగ్ టీమ్ చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన విద్యార్థులు
బైక్ లను వదిలేసి పొలాల్లోకి వెళ్ళిన విద్యార్థులు
అడవి పందుల నుండి పొలాన్ని రక్షించేందుకు కరెంట్ వైర్లను పెట్టిన రైతు
తప్పించుకొనే క్రమంలో కరెంట్ వైర్ లు తాకి వరి పొలంలో పడిపోయిన ఇద్దరు విద్యార్థులు
పొలంలో నీళ్ళు ఉండటంతో, కరెంట్ వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా పెరిగిన షాక్ తీవ్రత
సంఘటనా స్థలంలోనే చనిపోయిన మోక్షచరణ్, యశ్వంత్
పెట్రోలింగ్ టీమ్ లైట్లు చూసి భయపడ్డ విద్యార్థులు
సంఘటనా జరిగిన తరువాత పెట్రోలింగ్ టీమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన మరో విద్యార్థి
పెట్రోలింగ్ టీమ్ కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు
అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న మోక్షచరణ్, యశ్వంత్
ఇద్దరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అప్పటికే మృతి చెందినట్లు చెప్పిన వైద్యులు
మొక్షచరణ్, యశ్వంత్ లో మృతదేహాలకు మార్చురీకి తరలించిన పోలీసులు
ఉప్పర్పల్లి కి చెందిన మొక్షచరణ్, ఎస్ ఆర్ నగర్ కి చెందిన యశ్వంత్.





