బీహార్లో వైరల్ వీడియో అవాస్తవం

బీహార్లో ప్రేమ కోసం రష్యన్ మహిళ వచ్చిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది.
భాగల్పూర్కు చెందిన వ్యక్తితో ప్రేమ అంటూ వీడియోలు వైరల్ కాగా.. అందులో ఉన్నది పూర్ణియాకు చెందిన కంటెంట్ క్రియేటర్ నమిత్ భయ్.
సరిహద్దులు దాటిన ప్రేమకథ అంటూ ఈ వీడియోలను పలు మీమ్ పేజీలు షేర్ చేశాయి.
అసలేం జరిగింది..?
నమిత్ ఒక ప్రత్యేక వీడియోలో ఈ ప్రేమ ప్రచారాన్ని స్పష్టంగా కొట్టిపారేశారు, ఆమె ఇంగ్లాండ్ నుంచి తన అతిథిగా వచ్చిన పర్యాటకురాలని తెలిపారు.
ఆమె రష్యాకు చెందిన మహిళ కాదు.. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన పర్యాటకురాలు.
గ్రామీణ మహిళలకు మద్దతు, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్న ఓ ఎన్జీవో బృందంతో కలిసి ఆమె బీహార్ వచ్చారు.
సందర్శనకు వచ్చిన ఎన్జీవో బృందంతో నమిత్ కనిపించిన వీడియోల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి వైరల్ చేశారు.
నమిత్ అతిథిగా ఆమె గ్రామానికి రాగా, ఆ వీడియోలను కంటెక్స్ట్ మార్చేసి ప్రేమకథగా ప్రచారం చేశారు.
పూర్ణియా ఘటనను భాగల్పూర్ ప్రేమకథగా ప్రచారం చేశారు.





