హైదరాబాద్లో ఇండియా టీం కు షాక్.. 24 పరుగులతో విండీస్ విజయం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాలుగో టీ20లో వెస్టిండీస్ చేతిలో భారత్ 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2–2తో సమమైంది.
వెస్టిండీస్: 247/3 (20 ఓవర్లు)
భారత్: 223 ఆలౌట్ (19.4 ఓవర్లు)
షై హోప్: 50 బంతుల్లో 102 నాటౌట్ — 4 ఫోర్లు, 9 సిక్సర్లు.
కీమో పాల్: 41 పరుగులకు 5 వికెట్లు.
సంజూ శాంసన్: 23 బంతుల్లో 56 పరుగులు.
షెర్ఫేన్ రూథర్ఫర్డ్ కూడా 26 బంతుల్లో 49 నాటౌట్తో విండీస్ భారీ స్కోరుకు తోడ్పడ్డాడు.
ఛేదనలో శాంసన్ మెరుపు ఆరంభం ఇచ్చినా.. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన భారత్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కీమో పాల్ ఐదు వికెట్ల ప్రదర్శన విండీస్ విజయానికి బాట వేసింది. హైదరాబాద్ ఫాన్స్ అంతా నిరాశ తో వెనుతిరిగారు
సిరీస్ ఎవరిదో తేల్చే చివరి పోరు అక్టోబరు 17న బెంగళూరులో!





