మైదుకూరు జీవి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం. ఐదుగురికి గాయాలు..!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మైదుకూరు సమీపంలోని జీవి సత్రం రామప్పగారి పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును టిప్పర్ ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో కాజీపేటకు చెందిన డ్రైవర్ శ్రీనివాసులుతో పాటు 11 ఏళ్ల వంశీ, 8 ఏళ్ల యాస్మి, 45 ఏళ్ల రాజకుమార్, 33 ఏళ్ల జ్యోతి గాయపడ్డారు.
ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





