ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళా ఉద్యోగులతో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి సీతక్క
ఎర్రమంజిల్ ENC కార్యాలయ & ఖైరతాబాద్ CPR కార్యాలయంలో బతుకమ్మ సంబరాలలో ముఖ్య అథిదిగా మంత్రి సీతక్క, కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు, రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడిన కార్యాలయ ప్రాంగణంలో మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బంది, ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి, పాటలు పాడారు. ఉద్యోగ బాధ్యతల బిజీలోనూ మహిళా సిబ్బంది పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేలా మంత్రి ఆత్మీయంగా మమేకమై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. మంత్రి తమతో కలిసి పండుగ జరుపుకోవడం పట్ల మహిళా ఇంజనీర్లు అమితానందం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మహిళా సిబ్బంది మంత్రి సీతక్కకు ప్రేమతో బొట్టు పెట్టి, బట్టలు బహూకరించి ఆప్యాయతను చాటుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ఈ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి.





