ఒకే శరీరం.. రెండు తలలు.. ఒడిశాలో అరుదైన జననం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఒడిశాలోని బెర్హంపుర్ ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రెండు తలలు, ఒకే శరీరంతో మగ కవలలు జన్మించారు. ఈ అరుదైన పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డైసెఫాలిక్ పారాపాగస్’ అంటారు.
రెండు తలలు, రెండు మెడలతో పాటు ఒక జత చేతులు, కాళ్లు, ఒకే మూత్ర–జననేంద్రియ వ్యవస్థ ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కంధమాల్ జిల్లా తుముడిబంధ్ ప్రాంతానికి చెందిన మహిళకు 32 వారాల గర్భధారణ సమయంలో సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది.
నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ విభాగంలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.





