తెలంగాణలో భగ్గుమన్న సాగునీటి చిచ్చు.. పోలీసుల ముందే రైతుల పిడిగుద్దులు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొల్లాపూర్: సాగునీటి పంపిణీ వివాదం రెండు గ్రామాల రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో ప్రవహిస్తున్న భీమా కాల్వ నీటి పంపిణీ విషయంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు పరస్పరం గొడవకు దిగారు.
జూరాల ప్రాజెక్టు నుంచి భీమా కాల్వకు నీరు విడుదలవుతున్న నేపథ్యంలో పంపిణీ విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నప్పటికీ, వారి సమక్షంలోనే రైతులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడులకు పాల్పడ్డారు.
సాగునీటి కోసం రైతులు బాహాబాహీకి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.





