నేతల మధ్య చిచ్చు పెట్టిన డిండి జలాల విడుదల !

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నల్లగొండ: డిండి లిఫ్ట్ నుంచి సాగునీటి విడుదల అంశంపై పాలకులు, నేతలు, అధికారులు సంకుచితంగా ఆలోచించడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. డిండి లిఫ్ట్కు కేబినెట్లో అనుమతులు లభించిన తర్వాత వివాదాలకు తెరలేపడం సమంజసం కాదని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్నది జిల్లాల మధ్య పంచాయితీల కోసం కాదని స్పష్టం చేశారు.
మహబూబ్నగర్లో కోదండరాం, హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు సరికావని గుత్తా అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిణామాలు రాష్ట్ర సమగ్రతకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్నారు. రబీలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, ఆ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం లేదని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.





