వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల, అక్టోబర్ 14: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలు, భజనలు, కోలాటాలు, వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా సాగింది. ధైర్యం, పరాక్రమానికి ప్రతీకగా నిలిచే సింహ వాహనంపై స్వామివారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జానకిదేవి, రంగశ్రీ, శాంత రామ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





