వైఎస్ఆర్సీపీ ఆరోపణలపై మండిపడ్డ మంత్రి నారాయణ.

ఎన్నికలపై వైసీపీ నేతలు అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు.
వార్డుల విభజన,రిజర్వేషన్ ప్రక్రియ చట్టప్రకారం చేయమని సిఎం ఆదేశించారు.
రాజకీయ ప్రమేయం లేకుండా అధికారులు పారదర్శకంగా చేశారు.
బీసీ కోటాలో మేయర్ గా పోటీ చేయాలని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ భావించారు..
అలా అని మేము బీసీ చేయలేదు.
రోస్టర్ ప్రకారం మేయర్ స్థానం ఓసీ జనరల్ అయింది.
రూప్ కుమార్ యాదవ్ డివిజన్ సైతం బీసీ మహిళ అయింది.
నా నియోజక వర్గంలో చాలా డివిజన్ల రిజర్వేషన్ లు మారిపోయాయి.
మంత్రిగా నేను అనుకుంటే మార్పులు చేసి ఉండొచ్చు.
కానీ మేము ఆ పని చేయలేదు.
నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళమని కలెక్టర్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చాము.
ఓటమి భయంతో వైసిపి నేతలు ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతుతాయి.
ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి.
మంచి చేసే వాళ్ళని ఆదరించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.





