జూబ్లీహిల్స్ లో ఆధ్యాత్మికత పేరిట మహిళకు వల.. 'శ్రీ చైతన్య గురూజీ' పై కేసు నమోదు.

Photo: Rajasekhar1961 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాపురంలో చిచ్చు పెట్టిన గురూజీ అలియాస్ మేరెడ్డి సునీల్రెడ్డి
కోర్టు ఆదేశాలతో శ్రీచైతన్య గురూజీపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని శ్రీవిద్యా సాధనా సెంటర్ నిర్వాహకుడిగా శ్రీ చైతన్య గురూజీ అలియాస్ సునీల్రెడ్డి
సాధనల పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యకు అసభ్య సందేశాలు, వ్యక్తిగత చాటింగ్లు
పెళ్లయిన కొన్ని నెలలకి తన భార్య పట్టించుకోవడం లేదని ఫిర్యాదు..
తన భార్యకు అసభ్య మెసేజ్లతో పాటు అభ్యంతరగా మెసేజ్ లు పెట్టిన గురూజీపై ఫిర్యాదు.
గురిజిని నిలదీసినందుకు బాధితురాలి భర్త విష్ణుదీప్రెడ్డికి చంపేస్తానని బెదిరింపులు
చాటింగ్ ఆధారాలు, బెదిరింపుల వివరాలతో కోర్టు ను ఆశ్రయించిన భర్త
మేరెడ్డి సునీల్రెడ్డిపై BNS 351(2) సెక్షన్ కింద కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం





