నాగార్జునసాగర్ బుద్ధవనంలో వర్షావాసం

Photo: Anandajoti / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాగార్జునసాగర్ బుద్ధవనంలో చారిత్రక ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 1800 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బౌద్ధులు పవిత్రంగా భావించే వర్షావాస కార్యక్రమం మొదలైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బుద్ధవనం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది.





