నాగారంలో ఫారెస్ట్ నోటీసులు.. స్థానికుల ఆగ్రహం

Photo: Dsdugan / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ నాగారం ప్రాంతంలో అటవీ శాఖ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు. మూడు కాలనీలకు చెందిన ఇళ్లను వారంలో ఖాళీ చేయాలంటూ ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 20 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటుంటే ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లాలని కాలనీవాసులు మండిపడుతున్నారు. గతంలో ప్రభుత్వమే కేటాయించిన భూమి ఫారెస్ట్ ల్యాండ్ ఎలా అవుతుందని నిలదీస్తున్నారు.





