అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ముగిసిన జగన్ సుదీర్ఘ సమావేశం.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల నేతలతో జగన్ చర్చ.
అభ్యర్థుల ఎంపిక, సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై రీజినల్ కో-ఆర్డినేటర్లు,జిల్లా అధ్యక్షులు,పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో చర్చ
జిల్లాల వారీగా నేతలతో చర్చించిన జగన్.
రీజినల్ కో-ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ అబ్జర్వర్లతో జగన్ ముఖాముఖి చర్చ.
అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై పలు సూచనలు చేసిన జగన్.
కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో చర్చించిన జగన్.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన, అరాచకాలు కొనసాగు తున్నాయని నేతలతో చెప్పిన జగన్.
రెండున్నరేళ్లగా రాష్ట్రంలో సాగుతున్న దుర్మార్గపాలన, పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించిన జగన్.
ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నోడ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారులతో అక్రమాలు చేయిస్తున్నారన్న జగన్.
విశాఖపట్నంలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ కులస్తురాలు అయితే, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇచ్చారన్న జగన్
సమస్యపై పోరాటం చేసి సాధించుకునేలోపు
ఎన్నికల సమయం ముగుస్తుందని అందుకే జాప్యం చేస్తున్నారన్న జగన్.
స్థానిక సంస్థల ఎన్నికల సిఎం చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నాడన్న జగన్.
ఇలాంటి అంశాలపై రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటి కప్పుడు స్పందించాలని ఆదేశం..
అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలన్న జగన్.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి.
ప్రజల దృష్టికి తీసుకు రావాలని,లీగల్ టీంను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశం.
వైయస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్లు పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్నారు .
వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న జగన్.
నిబంధనలకు విరుద్ధంగా, చట్టాన్ని ధిక్కరిస్తూ వ్యవహరించే వారిపై న్యాయపోరాటం తప్పదనే సందేశం ఇవ్వాలి.
పార్టీ పట్ల అత్యంత విశ్వసనీయత, విధేయత ఉన్న వారికి అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించిన జగన్.





