ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ — హైదరాబాద్

కేటీఆర్ భయపడ్డాడు..
లొట్టపీసు కేసు అని, ఏం పీక్కుంటారో పీక్కోండి అని గొప్పలు కొట్టిన కేటీఆర్ ఇప్పుడు గడగడ వణికిపోతున్నాడు..
ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై రెంకెలు వేసిన కేటీఆర్ ఇప్పుడు కోర్టులకు పరుగులు పెడుతున్నాడు..
డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు..
తప్పు చేయకపోతే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు..?
ఇంతకాలం ఎందుకు గొప్పలు కొట్టాడు..?
విచారణను ఎదుర్కోవడానికి కేటీఆర్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
విచారణకు పిలిచినప్పుడు ఏసీబీ ఆఫీసు ముందు కేటీఆర్ పెద్ద షో చేశాడు..
కేసులో ఏమీ లేదు, ఏం పీక్కుంటారో పీక్కోండి అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు..
మరి ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లాడు..? ఎందుకు భయపడుతున్నాడు..?
Formula E Operations సంస్థకు చేసిన ₹54.88 కోట్ల చెల్లింపుపై సమాధానం చెప్పు..
ఎవరి అనుమతితో ఈ డబ్బులు పంపావో చెప్పాలన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు..
నువ్వు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో నీ నిజాయితీ నిరూపించుకో..
డిశ్చార్జ్ పిటిషన్లు వేసి మధ్యలోనే తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు..?
లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు దాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు..
స్టార్ హోటళ్ల భాగోతం బయటకు రావడంతో చలి, జ్వరం వచ్చి తప్పించుకుని కేటీఆర్ తిరుగుతున్నాడు.. గజగజా వణికిపోతున్నాడు..
ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎక్కడ దొరికిపోతానోనని దొంగదార్లు వెతుక్కుంటున్నాడు..
కేటీఆర్ వైఖరిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి..
మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది.. కేటీఆర్ అక్రమాలు బయటకు వస్తాయన్న విశ్వాసం ఉంది..
కోర్టుల ద్వారా కేటీఆర్ బండారం బయటపడుతుంది..





