ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.

Photo: iMahesh / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హై కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన వైసీపీ.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్.
రాష్ట్ర పోలీసుల జోక్యం లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన వైసీపీ.
24x7 వెబ్‌కాస్టింగ్,సీసీటీవీ సర్వేలెన్స్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను
ఆదేశించాలని కోరిన వైసీపీ.
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరిన వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిటీ సర్టిఫికెట్లు, ఎన్వోసీలు,నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీకి అడ్డంకులు సృష్టిస్తున్నారని పిటిషన్.
ఎన్నికల బరిలో నిలిచే ఆశావహులకు సర్టిఫికెట్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన వైసీపీ





