అమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలు

మధ్యాహ్నం 12 గంటలకు జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు
రిజర్వేషన్ల ఖరారుపై తమకు సరైన సమాచారం ఇవ్వకుండానే ప్రక్రియ పూర్తి చేశారన్న జన సేన మంత్రి మనోహర్
రిజర్వేషన్ల వ్యవహారంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న జనసేన
డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
ఖరారైన రిజర్వేషన్లను మార్చే అవకాశం లేదని జనసేనకు స్పష్టం చేసిన చంద్రబాబు
రిజర్వేషన్ల మార్పు సాధ్యం కాకపోతే కొత్త స్థానాలపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలంటున్న జనసేన
స్థానాల ఖరారుపై జనసేన, బీజేపీ నుంచి కొత్త ప్రతిపాదనలు, నేడు మరోసారి చర్చలు
స్థానిక ఎన్నికల్లో 35 శాతం సీట్లు కేటాయించాలని కోరుతున్న జనసేన
నెల్లూరు, తిరుపతి కార్పొరేషన్లను కోరిన బీజేపీ
నెల్లూరులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నందున అక్కడ బీజేపీ పోటీ చేయడం సరికాదన్న టీడీపీ
తిరుపతి నుంచి టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టం
నెల్లూరు, తిరుపతి స్థానాల బదులు ప్రత్యామ్నాయ కార్పొరేషన్ ను చూసుకోవాలని బీజేపీకి టీడీపీ సలహా
నేడు మరోసారి సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న బీజేపీ నేత మాధవ్
జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఈ సాయంత్రం చంద్రబాబుతో మరోసారి చర్చించనున్న కూటమి నేతలు
కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నేడు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
ఈ సాయంత్రానికి జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0





