తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!భక్తులకు ఊరట.. రేపటి నుంచే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ప్రారంభంవికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణంచిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలిఅనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఎలుగుబంట్ల సంచారం.పాతబస్తీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలుధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద హై అలర్ట్టీమిండియాకు విండీస్ ఝలక్.. రెండో టీ20లో విజయంహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!భక్తులకు ఊరట.. రేపటి నుంచే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ప్రారంభంవికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణంచిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలిఅనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఎలుగుబంట్ల సంచారం.పాతబస్తీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలుధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద హై అలర్ట్టీమిండియాకు విండీస్ ఝలక్.. రెండో టీ20లో విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

చిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి

ప్రత్యేక కథనంజాతీయం
చిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాలనీలో మిగిలిన 4 ఎకరాల భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలి

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే చిత్రపురి కాలనీలో అక్రమాలపై స్పందించాలి

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ చీఫ్ తో చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకుల భేటీ

హైదరాబాద్ :

చిత్రపురి కాలనీ సోసైటీ లో అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీ తో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ అనే వ్యక్తి.. సోసైటీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒకే వ్యక్తి ఇంత అవినీతికి పాల్పడటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల సహకారం ఉందని చెప్పారు. అనిల్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులతో కలిసి శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ ఫెడరేషన్ లోని అన్ని విభాగాలను చెరబట్టిన అనిల్.. ఇప్పటికీ చిత్రపురి కాలనీలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సినీ కార్మికులకు మేలు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నటుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి 1994 లో 67 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిలో కార్మికులకు ఇళ్లను కేటాయించే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. అప్పటి మంత్రుల సహకారంతో అవినీతికి పాల్పడిన అనిల్... ఇప్పుడు కాలనీలో మిగిలి ఉన్న 4 ఎకరాల భూమిపై కన్నేశారన్నారు. కో ఆపరేటివ్ సోసైటీ రూల్స్ ను తుంగలో తొక్కి ఆ భూమిని మార్టిగేజ్ పెట్టి రూ. 19 కోట్లు తీసుకున్నారన్నారు. తాజాగా ఆ భూముల్లో ఫ్లాట్లు కడుతున్నామంటూ నిసిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారంటున్నారన్నారు. ఇంత బాహాటంగా ఫ్లాట్లు కడుతున్నామంటూ అవినీతికి పాల్పడుతుంటే..కో ఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ రావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోని ఆ భూమిని పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించాలని కోరారు.

అనిల్ ను వెంటనే తొలగించాలి

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఫ్లాట్ల విషయంలోనే కాకుండా అక్కడ ఇళ్ల సముదాయాలను బట్టి కూడా రూ. 23, 10 కోట్లు అంటూ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కోసం సోసైటీ వాళ్ల నుంచి 2 లక్షలు వసూలు చేశారని చెప్పారు. మళ్లీ ఆదివారం జరగనున్న సీఎం సభ కోసం మరోసారి 2 లక్షలు కావాలంటూ బెదిరిస్తున్నాడన్నారు. అదే విధంగా తోట రామకృష్ణ అనే సీనియర్ డైరెక్టర్ కు కేటాయించిన ఇల్లును వేరే వాళ్లకు అమ్మారని.. అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఆదివారం జరిగే

X లో చూడండి ›

సంబంధిత వార్తలు