వ్యాపారులకు భారీ ఊరట.. జీఎస్టీ కేసుల పరిమితి రూ.5 కోట్లకు పెంపుపై ప్రతిపాదన

అక్టోబర్ 8న ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ GST మండలి సమావేశం..
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భేటీకి హాజరు..
జీఎస్టీ కౌన్సిల్ భేటీ, ఫరూక్ అబ్దుల్లాతో చర్చల తర్వాత జమ్ముకశ్మీర్‌లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్య..
అరెస్ట్ నిబంధనలు, ఈ-కామర్స్ రూల్స్, కీలక కాంప్లయన్స్ సంస్కరణలు ఎజెండాలో ప్రధానాంశాలు..
విదేశీ బ్రాంచ్‌ల ద్వారా జరిగే సర్వీసులు, SEZ సరఫరాలను ఇకపై ఎగుమతులుగా పరిగణించే అవకాశం..
BESS, EPC సేవలపై జీఎస్టీ తగ్గించాలని కోరుతున్న పునరుత్పాదక ఇంధన రంగం..
జీఎస్టీ కేసుల నమోదు పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచే యోచనలో కౌన్సిల్..
వ్యాపారులపై అరెస్టు చర్యల తొలగింపు.. కేవలం పన్ను వసూలు, జరిమానాలు మాత్రమే విధించేలా ప్రతిపాదన..
రూ.10,000 కంటే తక్కువ పన్ను వివాదాలపై నోటీసుల రద్దు.. 11.3 లక్షల కేసుల ఉపసంహరణ..
సప్లైయర్ తప్పు చేసినా పన్ను చెల్లించిన కొనుగోలుదారుల ITC రద్దు చేయబోమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది..
ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, వాహనాల సర్వీసింగ్, టెలికామ్ టవర్లకు కూడా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వర్తింపు..
10 రోజుల్లోనే రీఫండ్ అక్నాలెడ్జ్‌మెంట్.. రిస్క్ అసెస్‌మెంట్‌తో 90% క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా విడుదల..
రూ.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్నవారికి త్రైమాసిక చెల్లింపులతో ఐచ్ఛిక వార్షిక రిటర్న్, ఆలస్య రుసుముల మినహాయింపు..
ఆరోగ్య రంగంలో మరో 7 అరుదైన వ్యాధుల ఔషధాలపై పన్ను మినహాయింపు ప్రతిపాదన..





