శ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రూ.1,129.04 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో జూలై నెలలో అత్యధికంగా రూ.140.28 కోట్ల ఆదాయం రాగా, సెప్టెంబర్ 10న ఒక్కరోజే రూ.6.94 కోట్ల కానుకలు అందాయి. నెలవారీ వివరాలు పరిశీలిస్తే జూన్‌లో రూ.128.30 కోట్లు, జూలైలో రూ.140.28 కోట్లు, ఆగస్టులో రూ.137.44 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.126.41 కోట్ల ఆదాయం నమోదైంది.





