ఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ పాస్‌పోర్టుల గుట్టు రట్టు..
అక్రమంగా భారత పాస్‌పోర్టులు పొందిన ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు..
నిందితులు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన వారిగా గుర్తింపు..
అక్టోబర్ 3, 4 తేదీల్లో ఎయిర్‌పోర్టులో అధికారుల తనిఖీలు..
రెండు బంగ్లాదేశ్ పాస్‌పోర్టులతో అబుదాబి మీదుగా పారిస్ వెళ్లేందుకు యత్నించిన రోబింద్ర మోండల్ (48)..
తప్పుడు వివరాలతో భారత పాస్‌పోర్టు పొంది పలు దేశాలు తిరిగిన నేపాల్ వాసి దీపక్ ప్రకాష్ గిరి (40)..
మరో గుర్తింపుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించి దొరికిపోయిన ఆఫ్ఘన్ పౌరుడు తాజా ఖాన్ జుర్మతి..
ముంబై, కోల్‌కతా ఏజెంట్ల సాయంతో నకిలీ పత్రాలు సృష్టించినట్లు అనుమానం..
నకిలీ గుర్తింపు పత్రాల రాకెట్‌పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.





